Published on May 28, 2025
Government Jobs
ఎయిమ్స్‌ జమ్మూలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు
ఎయిమ్స్‌ జమ్మూలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌, జమ్మూ (ఎయిమ్స్‌, జమ్ము) వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 70  (ఈడబ్ల్యూఎస్‌ - 04; యూఆర్‌- 16; ఓబీసీ - 35; ఎస్సీ - 11; ఎస్టీ - 04)

వివరాలు:

విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బర్న్స్‌& ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, కమ్యూనిటీ మెడిసిన్‌, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, మెటబాలిజమ్‌, ఫారెన్సిక్‌ మెడిసిన్‌ & టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నియోనెటాలజీ, నెఫ్రాలజీ, ఒబెస్ట్రిక్స్‌&గైనకాలజీ, ఆప్లాల్మాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్‌ సర్జరీ, పీడియాట్రిక్స్‌, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరఫీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్‌&బ్లడ్‌బ్యాంక్‌, ట్రామా&ఎమర్జెన్సీ మెడిసిన్‌, యూరాలజీ.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్‌బీ, ఎంబీబీఎస్‌, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభువం ఉండాలి. పూర్తి వివరాలకు ఎయిమ్స్‌ జమ్మూ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.

వయోపరిమితి: 2025 జూన్‌ 14వ తేదీ నాటికి అభ్యర్థులకు 45 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు నాన్‌ మెడికల్ పోస్టులకు రూ.56,100, మెడికల్ పోస్టలకు రూ.67,700.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ ఓబీసీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 మే 30. 

దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 14.

వేదిక: బోర్డ్ రూమ్, 6వ అంతస్తు, అకడమిక్ బ్లాక్, ఎయిమ్స్ విజయపురి జమ్మూ - 184120.

Website:https://www.aiimsjammu.edu.in/open-positions/