రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పుర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్ట్ ప్రాతిపదికన నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టల సంఖ్య: 10
వివరాలు:
1. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్: 06
2. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్: 01
3. అకౌంట్స్ ఆఫీసర్: 01
4. మెడికల్ ఆఫీసర్ ఆయుష్ (ఆయుర్వేద): 01
5. చైల్డ్ సైకాలజిస్ట్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎండీ/ఎంఎస్, ఎంఏ/ ఎంఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్ పోస్టులకు 21-40 ఏళ్లు; మిగతా పోస్టులకు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్ పోస్టులకు రూ.6,600; మిగతా పోస్టులకు రూ.5,400.
దరఖాస్తు ఫీజు: రూ.3,000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.2,400.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 7-11-2024.
Website:https://www.aiimsjodhpur.edu.in/