Published on Jun 17, 2025
Government Jobs
ఎయిమ్స్‌ గువాహటిలో ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్‌ గువాహటిలో ఫ్యాకల్టీ పోస్టులు

గువాహటిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్ట్‌ రిక్యూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 64

వివరాలు:

ప్రొఫెసర్‌- 16

అడిషనల్‌ ప్రొఫెసర్‌- 16

అసోసియేట్‌ ప్రొఫెసర్‌- 11

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- 21

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, డీఎన్‌బీ, ఎంఎస్‌/ ఎండీ, ఎంసీహెచ్‌, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌కు 58ఏళ్లు; అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 50ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ/ ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15-07-2025.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30.07.2025.

Website:https://aiimsguwahati.ac.in/page/recruitapplication