Published on Jan 1, 2025
Government Jobs
ఎయిమ్స్‌, గువాహటిలో ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్‌, గువాహటిలో ఫ్యాకల్టీ  పోస్టులు

అస్సాం, గువాహటిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 77

వివరాలు:

1. ప్రొఫెసర్‌: 17

2. అడిషనల్ ప్రొఫెసర్‌: 17

3. అసోసియేట్ ప్రొఫెసర్‌: 18

4. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 25

విభాగాలు: అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, పాథాలజీ, పీడియాట్రిక్స్‌, గైనకాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ ఎండీ/ ఎంఎస్‌/ ఎంసీహెచ్‌/ డీఎం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,68,900; అడిషనల్ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,48,200; అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,38,300; అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,01,500.

వయో పరిమితి: 58 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1500, ఎస్సీ/ఎస్టీ/ మహిళా/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 19-01-2025

Website:https://aiimsguwahati.ac.in/