ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గోరఖ్‌పూర్ (ఎయిమ్స్ గోరఖ్‌పూర్) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
సీనియర్ రెసిడెంట్: 50
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ,ఎండి/ఎంఎస్/డీఎన్‌బీ(ఇన్ అనెస్తీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ లేదా ఆర్థోపెడిక్స్)లో ఉత్తీర్ణత ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు.ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.67,700.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.250 పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 సెప్టెంబర్ 16.
వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎయిమ్స్ క్యాంపస్, కున్రఘాట్, గోరఖ్‌పూర్, ఉత్తర్ ప్రదేశ్ -273008.