Published on Nov 15, 2024
Walkins
ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ ఖాళీలు
ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ ఖాళీలు

గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS).. కింది విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టు పేరు-ఖాళీలు:

సీనియర్‌ రెసిడెంట్‌: 41

విభాగాలు: అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, పాథాలజీ, పీడియాట్రిక్స్‌, గైనకాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ ఎండీ/ ఎంఎస్‌/ ఎంసీహెచ్‌/ డీఎం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీ రూ.800, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ. 

దరఖాస్తు చివరి తేదీ: 27-11-2024.

ఇంటర్వ్యూ తేదీ: 28-11-2024.

వేదిక: కాన్ఫరెన్స్ హాల్, గ్రౌండ్ ఫ్లోర్, ఆయుష్ బిల్డింగ్‌, ఎయిమ్స్‌ రాజ్‌కోట్.

Website:https://aiimsrajkot.edu.in/