Published on Nov 25, 2024
Current Affairs
ఎఫ్‌-1 ఛాంప్‌ వెర్‌స్టాపెన్‌
ఎఫ్‌-1 ఛాంప్‌ వెర్‌స్టాపెన్‌

రెడ్‌బుల్‌ స్టార్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ వరుసగా నాలుగోసారి ఫార్ములావన్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. లాస్‌వేగాస్‌ గ్రాండ్‌ప్రిలో అయిదో స్థానంలో నిలిచిన ఈ బెల్జియం రేసర్‌.. ఈ ఛాంపియన్‌షిప్‌ నెగ్గడానికి అవసరమైన పాయింట్లు సాధించాడు.

ఈ సీజన్లో 13సార్లు పోడియంపై నిలిచిన వెర్‌స్టాపెన్‌ 8 రేసుల్లో విజేతగా నిలిచాడు. మొత్తంగా 403 పాయింట్లతో డ్రైవర్ల ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

ఫార్ములావన్‌ చరిత్రలో వెర్‌స్టాపెన్‌ కనీసం నాలుగు ఛాంపియన్‌షిప్‌ టైటిళ్లు గెలిచిన ఆరో డ్రైవర్‌. అతడు తొలిసారి 2021లో ఎఫ్‌-1 ఛాంపియన్‌షిప్‌ నెగ్గాడు. మరోవైపు లాస్‌వేగాస్‌ జీపీని రసెల్‌ (మెర్సిడెస్‌) గెలుచుకున్నాడు.