ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా భారత మూలాలున్న కాశ్ పటేల్ నియామితులయ్యారు. ఆయన నియామకానికి అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది.
రిపబ్లికన్‌ల ఆధిక్యత ఉన్న సెనేట్‌లో ఆయనకు అనుకూలంగా 51 ఓట్లు, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి.
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమితుడైన తొలి భారతీయ అమెరికన్‌గా కాశ్ పటేల్ నిలిచారు. ఆ పదవిలో ఆయన పదేళ్లు కొనసాగుతారు.
1980లో న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో జన్మించిన కాశ్ పటేల్ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి.