అమెరికాలో అత్యంత కీలకమైన ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)’ అధిపతిగా భారతీయ అమెరికన్ కశ్యప్ పటేల్ (కశ్ పటేల్) నియమితులవనున్నారు.
ఈ మేరకు ఆయన్ను నామినేట్ చేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ 2024, డిసెంబరు 1న ప్రకటించారు.
గుజరాత్ మూలాలు ఉన్న కశ్యప్ తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్ జన్మించారు.