Published on Feb 10, 2025
Admissions
ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ కోర్సులు
ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ కోర్సులు

కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా 12 ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) క్యాంపస్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆలిండియా సెలక్షన్‌ టెస్ట్‌-2025 (ఏఐఎస్‌టీ- 2025)లో సాధించిన స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 

మొత్తం సీట్ల సంఖ్య: 2390

వివరాలు:

బ్యాచిలర్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌  

1. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడీఎస్.)

వ్యవధి: 4 సంవత్సరాలు (8 సెమిస్టర్లు)

బి.డిఈఎస్. (ఫుట్‌వేర్‌ డిజైన్‌ & ప్రొడక్షన్‌) (B.Des.- FDP)

బి.డిఈఎస్. (ఫ్యాషన్ డిజైన్) (B.Des. - FD)

బి.డిఈఎస్. (లెదర్, లైఫ్ స్టైల్ అండ్‌ ప్రొడక్ట్ డిజైన్) (B.Des. - LLPD)

2. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA)

వ్యవధి: 4 సంవత్సరాలు (8 సెమిస్టర్లు)

BBA (రిటైల్ & ఫ్యాషన్ మర్చండైజ్) (BBA - RFM)

మాస్టర్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌

1. మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎండీఎస్‌)

వ్యవధి: 2 సంవత్సరాలు (4 సెమిస్టర్లు)

ఎం.డిఈఎస్‌ (ఫుట్‌వేర్‌ డిజైన్‌ & ప్రొడక్షన్‌) (M.Des.- FDP)

ఎం.డిఈఎస్ (ఫ్యాషన్ డిజైన్) (M.Des.-FD)

2. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)

వ్యవధి: 2 సంవత్సరాలు (4 సెమిస్టర్లు)

ఎంబీఏ (రిటైల్ & ఫ్యాషన్ మర్చండైజ్) (MBA - RFM)

ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లు: నోయిడా, కోల్‌కతా, రోహ్‌తక్‌, ఫుర్సత్‌గంజ్‌, జోధ్‌పుర్‌, చెన్నై, ఛింద్వారా, చండీగఢ్‌, గుణ, అంక్లేశ్వర్‌, హైదరాబాద్‌, పట్న.

GATB-2025: జీఏటీ-బీ 2025 

అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులకు టెన్‌+2, మాస్టర్‌ డిగ్రీ కోర్సులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులకు 25 ఏళ్లు మించకూడదు. పీజీ కోర్సులకు వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం: ఆల్‌ ఇండియా సెలక్షన్‌ టెస్ట్‌ (ఏఐఎస్‌టీ-2025) ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ వారికి రూ.300.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 20.04.2025.

ఆలస్య రుసుముతో దరఖాస్తులకు గడువు తేదీ: 30.04.2025.

దరఖాస్తుల సవరణకు తేదీలు: 21, 22 ఏప్రిల్‌ 2025.

అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ: 01.05.2025

ఏఐఎస్‌టీ ప్రవేశ పరీక్ష తేదీ: 11.05.2025.

మెరిట్‌ మార్కుల వెల్లడి: జూన్‌ 2 - 3వ వారాల్లో.

కౌన్సిలింగ్‌ తేదీలు: జూన్‌- జులై

క్లాసులు ప్రారంభం: జులై 21.

Website:https://fddiindia.com/

Apply online:https://fddiadmissions.qualcampus.com/