Published on May 13, 2025
Government Jobs
ఎఫ్‌డీడీఐలో అకాడమిక్‌, నాన్‌ అకాడమిక్‌ పోస్టులు
ఎఫ్‌డీడీఐలో అకాడమిక్‌, నాన్‌ అకాడమిక్‌ పోస్టులు

హైదరాబాద్‌, అంకలేశ్వర్‌లోని ఫూట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవెలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌డీడీఐ) ఒప్పంద ప్రాతిపదికన అకాడిమిక్‌ అండ్‌ నాన్‌ అకాడమిక్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 18

వివరాలు: 

1. సీనియర్‌ ఫ్యాకల్టీ గ్రేడ్‌ 1/ చీఫ్‌ ఫ్యాకల్టీ: 01

2. జూనియర్‌ ఫ్యాకల్టీ/ ఫ్యాకల్టీ/ సీనియర్‌ ఫ్యాకల్టీ: 08

3. ల్యాబ్‌ అసిస్టెంట్‌: 03

4. జూనియర్‌ ఫ్యాకల్టీ/ ఫ్యాకల్టీ/ సీనియర్‌ ఫ్యాకల్టీ గ్రేడ్‌2,1: 01

5. అసిస్టెంట్‌ మేనేజర్‌: 05

విభాగాలు: ఫ్యాషన్‌ డిజైన్‌, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌, స్కూల్‌ ఆఫ్ ఫూట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌, ప్రమోషన్స్‌ అండ్‌ అడ్మిషన్స్‌, స్టూడెంట్‌ అపైర్‌ అండ్‌ ఎగ్జామినేషన్‌ డిపార్ట్‌మెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి, టెన్త్‌, ఏదైనా డిగ్రీ, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్‌, బీఈ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు జూనియర్‌ ఫ్యాకల్టీ పోస్టుకు రూ.45,000; ఫ్యాకల్టీకి రూ.65,000; సీనియర్‌ ఫ్యాకల్టీ గ్రేడ్‌1కు రూ.80,000;  సీనియర్‌ ఫ్యాకల్టీ గ్రేడ్‌2కు రూ.1,10,000; చీఫ్‌ ఫ్యాకల్టీకి రూ.1,50,000; ల్యాబ్‌ అసిస్టెంట్‌కు రూ.25,000; అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.40,000.  

కనిష్ఠ వయోపరిమితి: 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 26-05-2025.

Website: https://fddiindia.com/