ఐక్యరాజ్యసమితి, స్పెయిన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్‌మెంట్’’ 4వ అంతర్జాతీయ సదస్సు (ఎఫ్‌ఎఫ్‌డీ4) 2025, జూన్ 30న ప్రారంభమైంది.
జులై 3 వరకు జరగనున్న ఈ సదస్సుకు స్పెయిన్‌లోని సెవిల్లే నగరం ఆతిథ్యమిస్తోంది.
ప్రపంచ పేదరికంపై పోరాడే సమున్నత లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నారు.
ఎఫ్‌ఎఫ్‌డీ4 సదస్సు సన్నాహక సమావేశాన్ని జూన్ 17నే నిర్వహించారు.
పేద దేశాలకు ఏటా 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.340 లక్షల కోట్ల) ఆర్థిక సహాయాన్ని అందించే ప్రతిపాదనలతో ఐరాసలోని 193 సభ్యదేశాలు సంయుక్తంగా రూపొందించిన 38 పేజీల పత్రంపై ఆ సమావేశంలో చర్చించారు.