Published on Nov 17, 2025
Current Affairs
ఎన్‌2గ్రోత్‌ జాబితా
ఎన్‌2గ్రోత్‌ జాబితా
  • ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ మానవ వనరుల విభాగ సారథుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ఇరా బింద్రా చోటు దక్కించుకున్నారు. 2025 సంవత్సరానికి గాను 40 మంది ఉత్తమ మానవ వనరుల విభాగ ముఖ్య అధికారుల (సీహెచ్‌ఆర్‌ఓ) పేర్లతో ఓ జాబితాను ఎన్‌2గ్రోత్‌ విడుదల చేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో సీహెచ్‌ఆర్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇరా బింద్రాకు ఇందులో 28వ ర్యాంకు లభించింది.
  • ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ సంస్థ రిలయన్స్‌ కాగా.. ఇందులో భారత్‌ నుంచి చోటు సంపాదించిన మొట్టమొదటి మహిళ బింద్రానే.