నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ట్రెయినీ ఇంజినీర్ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్): 72
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ (బీఈ/బీటెక్/బీఎస్సీ)లో ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోసడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.50,000 - రూ.1,60,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఆధారంగా.
ఎంపిక విధానం: గేట్-2024, 2025 మార్కులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 మార్చి 16.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 6