జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2024, డిసెంబరు 23న ఆమోదముద్ర వేశారు.
సభ్యులుగా ప్రియాంక్ కనూంగో, డాక్టర్ జస్టిస్ బిద్యుత్‌రంజన్ షడంగిలను నియమించారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన జస్టిస్ అరుణ్‌కుమార్ మిశ్ర 2024, జూన్ 1న పదవీ విరమణ చేయగా, సభ్యురాలు విజయభారతీ సయానీ ప్రస్తుతం యాక్టింగ్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.