జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ) 2026 విద్యాసంవత్సరంకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా దేశవ్యాప్తంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎం అండ్ సీటీ)కి అనుబంధమైన ఇన్‌స్టిట్యూట్‌లలో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలు పొంవచ్చు.
వివరాలు:
బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా 10+2 (ఇంటర్మీడియట్) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
పరీక్ష విధానం: అబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 120 ప్రశ్నలకు జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 480 మార్కులు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్ మాద్యమంలో నిర్వహిస్తారు. తప్పు సమాధానానికి -1 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ ఎఫైర్స్‌లలో 15 ప్రశ్నల చొప్పున 45 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో 45 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్‌లో 30 మార్కులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్- రూ.1000; ఈడబ్ల్యూఎస్- రూ.700; ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులకు థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.450.
దరఖాస్తు రిజిస్ట్రేషన్, పరీక్ష ఫీజు చివరి తేదీ: 25-01-2026.
పరీక్ష తేదీ: 25-04-2026.