జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) 9వ ఛైర్‌పర్సన్‌గా విజయా కిశోర్ రహాట్కర్ నియమితులయ్యారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ 2024, అక్టోబరు 19న ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు (ఏదీ ముందు అయితే అది) ఆమె ఈ పదవిలో ఉంటారు.
* విజయ 2016-21 మధ్య మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2007-10 మధ్యకాలంలో ఛత్రపతి శంభాజీనగర్ మేయర్‌గానూ సేవలందించారు.