Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 25, 2026
Government Jobs
ఎన్‌సీఎల్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు
ఎన్‌సీఎల్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

పుణెలోని నేషనల్ కెమికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌సీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12

వివరాలు: 

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 03

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II: 07

సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 02

అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు రూ. 31,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-IIకు రూ.35,000 (సీఎస్‌ఐఆర్‌ యూజీసీ, నెట్‌, గేట్‌ స్కోర్‌ ఉన్న వారికి) ఇతరులకు రూ.28,000, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.42,000.

వయోపరిమితి: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు 35 ఏళ్లు, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 31.03.2026.

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ తేదీ: 09.04.2026.

Website:https://www.ncl-india.org/