Published on Dec 12, 2025
Government Jobs
ఎన్‌సీఎల్‌లో టెక్నీషియన్‌ పోస్టులు
ఎన్‌సీఎల్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

పుణెలోని సీఎస్‌ఐఆర్‌ నేషనల్ కెమికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌సీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 34

వివరాలు: 

టెక్నీషియన్‌: 15

టెక్నికల్‌ అసిస్టెంట్‌: 19

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో ఎంఎస్సీ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు టెక్నీషియన్‌కు రూ.19,900- రూ.63,200; టెక్నికల్‌ అసిస్టెంట్‌కు రూ.35,400- రూ.1,12,400.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 12.01.2026.

Website:https://www.ncl-india.org/