కేరళలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ (ఎన్‌సీఈఎస్‌ఎస్) తిరువనంతపురం కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
వివరాలు:
1. ప్రాజెక్టు అసోసియేట్-2(ఫైనాన్స్): 04
2. సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, సీఎంఏ,(ఇంటర్), ఎంకామ్, ఎంబీఏ(ఫైనాన్స్), డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్టు అసోసియేట్‌కు 35 ఏళ్లు, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కు 50 ఏళ్లు నిండి ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్టు అసోసియేట్‌కు రూ.28,000, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కు రూ.18,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 11 మార్చి 2025
వేదిక: ఎన్‌సీఈఎస్‌ఎస్, అక్కులం, తిరువనంతపురం-695011
Website:https://www.ncess.gov.in/notifications/vacancies.html