Published on Mar 26, 2025
Government Jobs
ఎన్‌సీఆర్‌టీసీలో ఇంజినీర్‌ పోస్టులు
ఎన్‌సీఆర్‌టీసీలో ఇంజినీర్‌ పోస్టులు

నేషనల్ క్యాపిటల్‌ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీఆర్‌టీసీ) ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 72

వివరాలు:

1. జూనియర్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్): 16

2. జూనియర్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రానిక్స్‌): 16

3. జూనియర్ ఇంజినీర్‌(మెకానికల్): 03

4. జూనియర్‌ ఇంజినీర్‌(సివిల్‌): 01

5. ప్రోగ్రామింగ్‌ అసోసియేట్‌: 04

6. అసిస్టెంట్‌(హెచ్‌ఆర్‌): 03

7. అసిస్టెంట్‌ (కార్పొరేట్‌ హాస్పిటాలిటీ): 01

8. జూనియర్‌ మెయింటెయినర్(ఎలక్ట్రికల్): 18

9. జూనియర్‌ మెయింటెయినర్‌(మెకానికల్): 10

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా,(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, మెకానికల్, ఐటీ, కంప్యూటర్స్‌) బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీబీఎం, డిగ్రీ(హోటల్‌ మేనేజ్‌మెంట్‌), ఐటీఐలో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 25 ఏళ్లు.

జీతం: నెలకు జూనియర్‌ ఇంజినీర్‌, ప్రోగ్రామింగ్‌ అసోసియేట్‌కు రూ.22,800 - రూ.75,850, అసిస్టెంట్‌కు రూ.20,250 - రూ.65,500, జూనియర్ మెయింటెయినర్‌కు రూ. 18,250 - రూ.59,200.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 24.

పరీక్ష తేదీ: మే 2025. 

Website:https://ncrtc.in/elementor-39298/