కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన దిల్లీలోని నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ) లిమిటెడ్ వివిధ విభాగాల్లో మెనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 60
వివరాలు:
జనరల్ మేనేజర్- 01
మేనేజర్- 02
డిప్యూటీ మేనేజర్- 01
అసిస్టెంట్ మేనేజర్- 08
సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్- 10
గ్రాడ్యుయేట్ అసిస్టెంట్- 02
జూనియర్ ఇంజినీర్- 35
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ, సీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు జనరల్ మేనేజర్‌కు రూ.90,000-2,40,000; గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌కు రూ.30,000- రూ.1,20,000; జూనియర్ ఇంజినీర్‌కు రూ.27,000; మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000; అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.40,000- రూ.1,40,000.
వయోపరిమితి: చివరి తేదీ నాటికి జనరల్ మేనేజర్‌కు 54 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్‌కు 28 ఏళ్లు; మేనేజర్‌కు 37 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌కు 33 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్‌కు 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: సీబీటీ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 05.04.2026.
Website:https://nbccindia.in/