Published on Nov 22, 2024
Government Jobs
ఎన్‌బీసీసీలో మేనేజీరియల్‌ ఉద్యోగాలు
ఎన్‌బీసీసీలో మేనేజీరియల్‌ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన దిల్లీలోని నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీసీసీ) లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08

వివరాలు:

చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (లా)- 01

జనరల్‌ మేనేజర్‌ (ఇంజినీరింగ్‌)- 02

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌ఎం)- 04

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌)- 01

అర్హత: ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, ఆర్కిటెక్చర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.లక్ష - రూ.2,60,000; జనరల్‌ మేనేజర్‌కు రూ.90,000 - రూ.2,40,000; డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు రూ.70,000- రూ.2 లక్షలు.

వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు 57 ఏళ్లు; జనరల్‌ మేనేజర్‌కు 54 ఏళ్లు; డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు 41 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 20-12-2024.

Website:https://nbccindia.in/