ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా 2025, మార్చి 3న సాసన్ గిర్‌లో జాతీయ వన్యప్రాణి మండలి (ఎన్‌బీడబ్ల్యూఎల్) ఒక నివేదికను తయారు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని విడుదల చేశారు. మన దేశంలోని నదుల్లో 6,327 డాల్ఫిన్లు ఉన్నాయని అది వెల్లడించింది. డాల్ఫిన్లపై ఇలాంటి నివేదిక ఇదే తొలిసారి. ఎనిమిది రాష్ట్రాల్లో 28 నదుల్లో సర్వే నిర్వహించి దీన్ని రూపొందించారు.