ముంబయిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) కింది విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 400 (ప్రస్తుత ఖాళీలు- 396, బ్యాక్‌లాగ్ ఖాళీలు- 04)
వివరాలు:
విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: 30-04-2025 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ వారికి మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100.
ఎంపిక ప్రక్రియ: గేట్ 2023/ 2024/ 2025 స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 10-04-2025.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-04-2025.