Published on Dec 12, 2025
Government Jobs
ఎన్‌డీఏ & ఎన్‌ఏ-2026 ఎగ్జామినేషన్‌-1 నోటిఫికేషన్‌
ఎన్‌డీఏ & ఎన్‌ఏ-2026 ఎగ్జామినేషన్‌-1 నోటిఫికేషన్‌

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (1) 2026 (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలలో ప్రవేశానికి సంబంధించి పోస్టులను యూపీఎస్సీ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. 

వివరాలు: 

మొత్తం ఖాళీల సంఖ్య: 394 (పురుషులు-370,  మహిళలు-24)

1. ఆర్మీ: 208 (పురుషులు-198, మహిళలు-10)

2. నావీ: 42 (పురుషులు-37, మహిళలు-05)

ఎయిర్ ఫోర్స్‌..

1. ఫ్లైయింగ్‌: 92 (పురుషులు-90, మహిళలు-02)

2. గ్రౌండ్‌ డ్యూటీస్‌(టెక్‌): 18 (పురుషులు-16, మహిళలు-02)

3. గ్రౌండ్‌ డ్యూటీస్‌(నాన్‌ టెక్‌): 10 (పురుషులు-08, మహిళలు-02)

నేవల్ అకాడమి(10+2 క్యాడెట్‌ ఎంట్రీ కేటగిరి స్కీమ్‌)..

ఖాళీల సంఖ్య: 24 (పురుషులు-21, మహిళలు-03)

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌)లో ఉత్తీర్ణత ఉండాలి.

ఎత్తు: పురుషులు 157 సెం.మీ, మహిళా అభ్యర్థులు 152 సెం.మీ ఉండాలి.

వయోపరిమితి: 16 1/2 నుంచి 19 1/2 ఏళ్లు ఉండాలి. 2007 జులై 1 కంటే ముందు 2010 జులై 1 తరువాత అభ్యర్థులు జన్మించి ఉండరాదు.

స్టైపెండ్‌: నెలకు రూ.56,100.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.100. ఇతరులకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 డిసెంబర్‌ 10.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 30.

ఎంపిక పక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఎంపిక విధానం:

ఎంపిక రెండు దశలలో జరుగుతుంది.

రాత పరీక్ష: యూపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలో అర్హత సాధించడం.

పేపర్లు: మ్యాథమెటిక్స్ (300 మార్కులు), జనరల్ ఎబిలిటీ టెస్ట్ (600 మార్కులు). మొత్తం 900 మార్కులు.

ప్రశ్నల రకం: అన్ని సబ్జెక్టులలో ఆబ్జెక్టివ్ (బహుళైచ్ఛిక) ప్రశ్నలు మాత్రమే ఉంటాయి.

నెగటివ్ మార్కింగ్: తప్పు సమాధానాలకు పెనాల్టీ (నెగటివ్ మార్కింగ్) ఉంటుంది.

సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB) టెస్ట్/ఇంటర్వ్యూ: 

రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB) ద్వారా ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. దీనికి 900 మార్కులు.

పరీక్ష తేదీ: 2026 ఏప్రిల్‌ 12.

పరీక్ష ఫలితాలు: 2026 మే.

ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ తేదీ: 2026 జూన్‌ నుంచి జులై వరకు.

ఎన్‌డీఏ 157వ కోర్సు ప్రారంభ తేదీ: 2027 జనవరి 1.

ఎన్‌ఏ 119వ కోర్సు ప్రారంభ తేదీ: 2027 జనవరి 1.

Website:https://upsc.gov.in/