దేశ సైనిక చరిత్రలో తొలిసారిగా 17 మంది మహిళలు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో శిక్షణ ముగించి పట్టా అందుకున్నారు. దిల్లీలోని జవహర్‌లాల్ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రాంగణంలో 2025, మే 29న జరిగిన ఎన్‌డీఏ 148వ స్నాతకోత్సవం దీనికి వేదికైంది. ఈ సందర్భంగా మహిళా కేడెట్లతో సహా మొత్తం 339 మంది పట్టా పుచ్చుకున్నారు. వీరిలో 84 మంది బీఎస్సీ, 85 మంది కంప్యూటర్ సైన్సు, 59 మంది బీఏ, 111 మంది బీటెక్ పట్టాలు పొందారు. వీరిని త్రివిధ దళాల్లో అధికారులుగా నియమిస్తారు.