కోల్‌కతాలోని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఫుడ్ అండ్ పీడీకు చెందిన నేషనల్ టెస్ట్ హౌజ్ (ఎన్‌టీహెచ్)లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 06.
వివరాలు:
1. సీనియర్ యంగ్ ప్రొఫెషనల్: 03
2. జూనియర్ యంగ్ ప్రొఫెషనల్: 03
విభాగాలు: టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, టెక్నికల్ ఫుడ్ అనలిస్ట్, టెక్నికల్, మేనేజ్‌మెంట్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, పీజీ, డాక్టరేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు సీనియర్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు రూ.70,000; జూనియర్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు రూ.40,000.
పని ప్రదేశాలు: ఘజియాబాద్, జైపుర్.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11-09-2024.
Website:https://www.nth.gov.in/