Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 2, 2026
Government Jobs
ఎన్టీపీసీ లిమిటెడ్‌లో అసిస్టెంట్ లా ఆఫీసర్‌ పోస్టులు
ఎన్టీపీసీ లిమిటెడ్‌లో అసిస్టెంట్ లా ఆఫీసర్‌ పోస్టులు

ఎన్టీపీసీ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) అసిస్టెంట్ లా ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

అసిస్టెంట్‌ లా ఆఫీసర్‌: 06

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 2026 జనవరి 16వ తేదీ నాటికి 30 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.30,000 - రూ.1,20,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 16.  

Website:https://careers.ntpc.co.in/recruitment/