ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా సరిత్ మహేశ్వరిని కంపెనీ బోర్డు 2025, మే 10న నియమించింది. ప్రస్తుతం సీఈఓగా కొనసాగుతున్న రాజీవ్ గుప్తా స్థానంలో ప్రస్తుత నియామకం జరిగింది. సరిత్ మహేశ్వరికి విద్యుత్ రంగంలో 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఎన్‌టీపీసీలో ప్రాజెక్ట్ కోర్బా హెడ్‌గా ఆయన వ్యవహరించారు.