Published on May 25, 2025
Government Jobs
ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు
ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు

ఎన్టీపీసీ లిమిటెడ్ మెకానికల్, ఎలక్ట్రికల్‌, సీ&ఐ విభాగాల్లో డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 150

వివరాలు:

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సీ&ఐ

1. డిప్యూటీ మేనేజర్‌(ఎలక్ట్రికల్): 40

2. డిప్యూటీ మేనేజర్‌(మెకానికల్‌): 70

3. డిప్యూటీ మేనేజర్‌(సీ&ఐ): 40

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌(ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, కంట్రోల్‌ & ఇనుస్ట్రుమెంటేషన్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 40 ఏళ్లు ఉండాలి. 

జీతం: నెలకు రూ.70,000 - రూ.2,00,000.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 9.

Website: https://careers.ntpc.co.in/recruitment/