Published on Oct 16, 2024
Government Jobs
ఎన్‌టీపీసీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలు
ఎన్‌టీపీసీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలు

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన జూనియర్ ఎగ్జిక్యూటివ్ (బయోమాస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 50

వివ‌రాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 27 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితి ఉంటుంది.

జీతం: నెలకు రూ.40,000.

దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 28-10-2024.

Website:https://ntpc.co.in/