Published on Jan 31, 2025
Government Jobs
ఎన్‌టీపీసీలో ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
ఎన్‌టీపీసీలో ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

న్యూదిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన గేట్‌-2024 స్కోర్‌ ద్వారా ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 475

వివరాలు:

1. ఎలక్ట్రానిక్స్‌- 135

2. మెకానికల్‌- 180

3. ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌- 85

4. సివిల్‌- 50

5. మైనింగ్‌- 25

అర్హత: ఇంజినీరింగ్‌ లేదా టెక్నాలజీ/ఏఎంఐఈలో 65 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఫుల్‌ టైం బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు 55%)తో పాటు గేట్‌ 2024 స్కోర్‌ తప్పనిసరి ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.40,000- రూ.1,40,000.

వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: గేట్‌ 2024 స్కోర్‌, షార్ట్‌లిస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.02.2025.

Website:https://ntpc.co.in/jobs-ntpc