Published on Feb 17, 2025
Government Jobs
ఎన్టీపీసీలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఎన్టీపీసీలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ), న్యూ దిల్లీ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 400 (యూఆర్‌-172; ఈడబ్ల్యూఎస్‌-40; ఓబీసీ-82; ఎస్సీ-66; ఎస్టీ- 40)

వివరాలు:

అర్హత: 40 శాతం మార్కులతో బీఈ, బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

జీతం: నెలకు రూ.55,000.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ-ఎన్‌సీఎల్‌ వారికి మూడేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది).

దరఖాస్తు ఫీజు: రూ.300. (ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు).

ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్‌ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 01-03-2025.

Website:https://careers.ntpc.co.in/recruitment/

Apply online:https://careers.ntpc.co.in/recruitment/login.php