Published on Feb 24, 2025
Admissions
ఎన్‌టీఏ- నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025
ఎన్‌టీఏ- నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఎన్‌టీఏ విడుదల చేసింది. దేశంలోని 13 మాధ్యమాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP)లో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఆర్‌ఐఈలు, ప్రభుత్వ కళాశాలలతో సహా మొదలైన వాటిలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తోంది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 6,100 సీట్లలో ఐటీఈపీ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్లు పొందవచ్చు. 

వివరాలు:

నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ) 2025

కోర్సులు: బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ.

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

వయోపరిమితి: అభ్యర్థులకు వయోపరిమితి లేదు.

సంస్థలు, సీట్ల వివరాలు: ఎన్‌సీఈటీ స్కోరు ఆధారంగా జాతీయ స్థాయిలో 64 వివిధ వర్సిటీలు/ ఆర్‌ఐఈ/ ఎన్‌ఐటీలు/ ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఈ సంస్థల్లో 6,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో ఉర్దూ వర్సిటీ (150 సీట్లు), వరంగల్‌ ఎన్‌ఐటీ (50), లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (50)లో సీట్లు; ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్‌ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతిలో (50 సీట్లు), శ్రీకాకుళం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో (100 సీట్లు) ఉన్నాయి.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష ఇంగ్లిష్‌, హిందీతో పాటు 13 భాషల్లో జరుగుతుంది.

దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్థులకు రూ.1200; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.650.

తెలుగు రాష్ట్రాలలోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, అనంతపురం, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-03-2025.

దరఖాస్తు సవరణ తేదీలు: 18, 19.03.2025.

పరీక్ష కేంద్రం వివరాల వెల్లడి: ఏప్రిల్‌ మొదటి వారం.

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడింగ్‌: పరీక్షకు 3 లేదా 4 రోజుల ముందు.

పరీక్ష తేది: 29-04-2025.

Website:https://exams.nta.ac.in/NCET/

Apply online:https://ncet2025.ntaonline.in/