Published on Feb 13, 2025
Admissions
ఎన్‌టీఏ- జిప్‌మ్యాట్‌ 2025
ఎన్‌టీఏ- జిప్‌మ్యాట్‌ 2025

2025 - 2026 విద్యా సంవత్సరానికి ఐఐఎం బోధ్‌గయ, ఐఐఎం జమ్ములో ఉమ్మడిగా అందిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ నేజ్‌మెంట్‌(ఐపీఎం)లో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్) - 2025 నోటిఫికేషన్‌ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది. 

జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్‌) - 2025.

వివరాలు:

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ)

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌

ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం)

వ్యవధి: అయిదేళ్లు.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌/ 10+2 (ఆర్ట్స్/కామర్స్/సైన్స్ గ్రూప్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 2023, 2024 సంవత్సరాల్లో లేదా 2025 చివరి సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌) రూ.2000; జనరల్‌(ఈడబ్ల్యూఎస్‌)/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులకు  రూ.1000.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు చివరి తేదీ: 10-03-2025.

పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: 11-03-2025.

దరఖాస్తు సవరణ తేదీలు: 13-03-2025 నుంచి 15-03-2025 వరకు.

పరీక్ష తేదీ: 26-04-2025.

Website:https://exams.nta.ac.in/JIPMAT/

Apply online:https://jipmat2025.ntaonline.in/site/login