Published on Oct 16, 2024
Government Jobs
ఎన్‌టీఆర్ఓలో సైంటిస్ట్ ‘బి’ పోస్టులు
ఎన్‌టీఆర్ఓలో సైంటిస్ట్ ‘బి’ పోస్టులు

దిల్లీలోని నేషనల్ టెక్నీకల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్ఓ) ఖాళీగా ఉన్న సైంటిస్ట్ ‘బి’ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 75

వివ‌రాలు:

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్‌, జియో- ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్, మ్యాథమేటిక్స్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గేట్ స్కోరు తప్పనిసరి.

వయోపరిమితి: 30 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500.

దరఖాస్తు ఫీజు: రూ.250; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: గేట్‌ స్కోరు, రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-11-2024

Website:https://ntro.gov.in/welcome.do