Published on Jan 27, 2025
Walkins
ఎన్‌జీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు
ఎన్‌జీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07

వివరాలు: 

1. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I (పీఏటీ-I): 03 

2. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II (పీఏటీ-II): 01

3. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II (పీఏ-II): 01

4. సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ (సీనియర్‌-పీఏటీ)- 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ/ ఎంఎస్‌టెక్‌/ ఎంటెక్‌, బీఈ/ బీటెక్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I పోస్టులకు రూ.20,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-IIకు రూ.25,000- రూ.31,000;  ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II(పీఏటీ2)పోస్టులకు రూ.28,000- రూ.35,000; సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.42,000.

వయసు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు 35 ఏళ్లు; సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది).

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.

ఈమెయిల్:career@ngri.res.in 

దరఖాస్తు గడువు: 04-02-2025.

ఇంటర్వ్యూ తేదీలు: 05, 07.02.2025.

వేదిక: సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఉప్పల్‌ రోడ్‌, హైదరాబాద్‌.

Website:https://www.ngri.res.in/