Published on Sep 20, 2024
Apprenticeship
ఎన్ఐసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎన్ఐసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

కోల్‌కతాలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్‌) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 16

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

శిక్షణ కాలం: రెండేళ్లు.

స్టైపెండ్: నెలకు మొదటి ఏడాది రూ.40,000;  రెండో ఏడాది రూ.45,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్/ ఆఫ్‌లైన్ ద్వారా.

ఈ-మెయిల్:HO.Pers@nic.co.in

చిరునామా: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది చీఫ్ మేనేజర్, పర్సనల్ డిపార్ట్‌మెంట్, నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్, హెడ్ ఆఫీస్, పర్మిసెస్ నెం.18-0374, ప్లాట్ నంబర్‌-సీబీడీ-81, న్యూటౌన్, కోల్‌కతా చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2024.

Website:https://nationalinsurance.nic.co.in/