భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ (ఎన్‌ఐబీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ సైంటిస్ట్, సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 46
వివరాలు:
సైంటిస్ట్ గ్రేడ్-II: 02
సైంటిస్ట్ గ్రేడ్-III(వెటర్నేరియన్): 02
జూనియర్ సైంటిస్ట్: 12
అసిస్టెంట్-II: 02
అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్: 01
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్: 01
లాబొరేటరీ టెక్నీషియన్: 25
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంవీఎస్సీ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం, టైపింగ్ నైపుణ్యం ఉండాలి.
జీతం: సైంటిస్ట్ గ్రేడ్-IIIకు రూ.78,800 - రూ.2,09,200; జూనియర్ సైంటిస్ట్‌కు రూ.44,900 -రూ.1,42,400; అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్/టెక్నీషియన్/ట్రాన్స్‌లేటర్‌కు రూ.35,400 - రూ.1,12,400; అసిస్టెంట్-IIకు రూ.19,900 - రూ.63,200.
వయోపరిమితి: చివరి తేదీ నాటికి సైంటిస్ట్ గ్రేడ్-IIIకు 35 ఏళ్లు; సైంటిస్ట్ గ్రేడ్-IIకు 45 ఏళ్లు; అసిస్టెంట్-IIకు 27 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 08.04.2026.
Website:https://www.nib.gov.in/