భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖకు చెందిన హైదారాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐపీహెచ్‌ఎం) 2025-26 విద్యాసంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ)తో కలిసి ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ రంగంలో 2025-26 సంవత్సరానికి డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (PGDPHM)
వ్యవధి: 12 నెలలు
డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (DPHM)
వ్యవధి: 6 నెలలు
మొత్తం సీట్లు: 30.
అర్హత: సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేట్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ ఇన్ అగ్రికల్చర్ ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు: రూ.200.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఆన్‌లైన్ పరీక్ష తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 31.10.2025.