Published on Jun 18, 2025
Walkins
ఎన్‌ఐటీ వరంగల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు
ఎన్‌ఐటీ వరంగల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ఒప్పంద ప్రాతిపదికన విజిటింగ్ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పార్టైమ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

1. విజిటింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌

2. పార్టైమ్ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఏ/ఎంఎస్సీ, ఎంఈడీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

జీతం: నెలకు విజిటింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.70,000, పార్టైమ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు గంటకు రూ.2000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 జులై 8. 

వేదిక: ఆఫీస్‌ ఆఫ్‌ హెడ్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌, ఎన్‌ఐటీ వరంగల్‌.

Website:https://nitw.ac.in/page/?url=/careersnitw/Jobs/