తమిళనాడులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) తిరుచిరాపల్లి ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 86
వివరాలు:
విభాగాలు: అర్కిటెక్చర్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్, హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్, మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్, ఫిజిక్స్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఏ, ఎంఏ, బీఎడ్, ఎంఈడీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, గేట్/నెట్/సెట్/సీఎస్‌ఐఆర్ సెట్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీలకు రూ.2,500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.1,250.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.04.2026.
ఆఫ్‌లైన్(హార్డ్‌కాపీ) దరఖాస్తుకు చివరి తేదీ: 16.04.2026.
Website:https://www.nitt.edu/