Published on Sep 30, 2024
Government Jobs
ఎన్ఐటీఎంలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
ఎన్ఐటీఎంలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌)కు చెందిన కర్ణాటక, బెళగావిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రేడిషనల్ మెడిసిన్ (ఎన్ఐటీఎం) తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివ‌రాలు:

టెక్నికల్ అసిస్టెంట్: 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.300

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ది డైరెక్టర్, ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టేడ్రిషనల్ మెడిసిన్, నెహ్రూనగర్, బెళగావి’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 18-10-2024

Website:https://icmrnitm.res.in/