Published on Nov 26, 2024
Government Jobs
ఎన్‌ఐఓహెచ్‌లో టెక్నీషియన్‌ పోస్టులు
ఎన్‌ఐఓహెచ్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

ప్రభుత్వరంగ సంస్థకు చెందిన అహ్మదాబాద్‌లోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అక్యూపేషనల్‌ హెల్త్‌ ( ఎన్‌ఐఓహెచ్‌) డిపార్ట్‌మెంట్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 27

వివరాలు:

అసిస్టెంట్‌- 02

టెక్నీషియన్‌- 19

ల్యాబొరేటరీని అటెండెంట్‌- 06

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఉద్యోగానుభవం ఉండాలి. 

జీతం: నెలకు అసిస్టెంట్‌ పోస్టుకు రూ.35,400- 1,12,400; టెక్నీషియన్‌ పోస్టుకు రూ.19,900- రూ.63,200; లాబొరేటరీ అటెండెంట్‌కు రూ.18,000- రూ.56,900;  

వయోపరిమితి: అసిస్టెంట్‌ పోస్టుకు 30 ఏళ్లు; టెక్నీషియన్‌ పోస్టుకు 28 ఏళ్లు; లాబొరేటరీ అటెండెంట్‌కు 25 ఏళ్లు మించకూడదు;  

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 11-12-2024.

Website:https://nioh.org/