Published on Jan 1, 2026
Apprenticeship
ఎన్‌ఐఓలో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు
ఎన్‌ఐఓలో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

ముంబయిలోని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రాఫీ (ఎన్‌ఐఓ) ఒప్పంద ప్రాతిపదికిన టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 14

వివరాలు: 

1. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ (డిప్లొమా): 04

2. గ్రాడ్యుయేట్‌ (నాన్‌- ఇంజినీరింగ్‌) అప్రెంటిస్‌షిప్‌: 10

శిక్షణ వ్యవధి: ఏడాది.

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ , రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏయిర్‌ కండిషనింగ్‌ ఇంజినీరింగ్‌, ఓషనోగ్రఫీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్‌.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు డిప్లొమా టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ.8,000; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9,000.

వయోపరిమితి: డిప్లొమా టెక్నీషియన్స్‌కు 18 నుంచి 24 ఏళ్లు; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 21 నుంచి 26 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఎన్‌ఏటీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 

ఇంటర్వ్యూ తేదీ: 08-01-2026.

వేదిక: సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ, రీజినల్‌ సెంటర్‌, లోఖండ్వాలా రోడ్‌, అంధేరి వెస్ట్, ముంబయి.

Website:https://www.nio.res.in/vacancies/temporary