చెన్నైలోని ఎర్త్‌సైన్స్ మంత్రిత్వశాఖకు చెందిన ప్రభుత్వరంగా సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) ఒప్పంద ప్రాతిపదికిన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 4
వివరాలు:
1. ప్రాజెక్ట్ ఇంజినీర్-1: 02
2. ప్రాజెక్ట్ ఇంజినీర్ అసిస్టెంట్: 02
విభాగాలు: సివిల్, కోస్టల్, ఓషియన్, హార్బర్ ఇంజినీరింగ్.
అర్హత: డిప్లొమా, బీఈ/ బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 35 ఏళ్లు; ప్రాజెక్ట్ ఇంజినీర్ అసిస్టెంట్‌కు 50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.56,000; ప్రాజెక్ట్ ఇంజినీర్ అసిస్టెంట్‌కు రూ.20,000.
పని ప్రదేశం: చెన్నై.
ఎంపిక ప్రక్రియ: ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టు ఇంటర్వ్యూ ద్వారా; ప్రాజెక్ట్ ఇంజినీర్ అసిస్టెంట్ పోస్టును రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14-03-2025.
Website:https://www.niot.res.in/
ఇంటర్వ్యూ తేదీ: 27-03-2025.
రాత పరీక్ష తేదీ: 28.03.2025.