దిల్లీలోని బ్రిక్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ (ఎన్‌ఐఐ) డైరెక్డ్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది స్టాఫ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
వివరాలు:
1. స్టాఫ్ సైంటిస్ట్-2: 03
2. స్టాఫ్ సైంటిస్ట్-4: 08
అర్హత: ఎంఎస్సీ లేదా ఎంటెక్/ ఎండీ/ ఎంవీఎస్సీ/ ఎంఫార్మ్/ ఎంబయోటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: స్టాఫ్ సైంటిస్ట్-2కు 40ఏళ్లు; స్టాఫ్ సైంటిస్ట్-4కు 50ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: రూ.500.
ఆన్‌లైన్ అప్లికేషన్‌లకు చివరి తేదీ: 26-05-2025.