సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ అగర్వాల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా 2026, జనవరి 14న నియమితులయ్యారు. ఈయన హిమాచల్ క్యాడర్‌కు చెందిన అగర్వాల్ 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఎన్‌ఐఏలో ప్రత్యేక డీజీగా పనిచేస్తున్నారు.
ఎన్‌ఐఏతో పాటు బీఎస్‌ఎఫ్, ఐటీబీపీలకు కొత్త డైరెక్టర్ జనరళ్లను కేంద్రం నియమించింది. మరో సీనియర్ ఐపీఎస్ శతృజీత్ సింగ్ కపూర్‌ను కేంద్రం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డీజీగా నియమించింది. ప్రస్తుతం ఐటీబీపీకి నేతృత్వం వహిస్తున్న ప్రవీణ్ కుమార్‌ను బీఎస్‌ఎఫ్ కొత్త చీఫ్‌గా నియమించారు.