Published on Aug 20, 2025
Walkins
ఎన్‌ఐఏబీలో టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులు
ఎన్‌ఐఏబీలో టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 14

వివరాలు:

1. టెక్నికల్ అసిస్టెంట్‌: 06

2. యంగ్‌ ప్రొఫెషనల్: 04

3. ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌: 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/బీఫార్మ్‌/బీవీఎస్సీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: టెక్నికల్ అసిస్టెంట్‌కు 50 ఏళ్లు, యంగ్‌ ప్రొఫెషనల్, ప్రాజెక్ట్ రిసెర్చ్‌ సైంటిస్ట్‌కు 35 ఏళ్లు.

ఫెలోషిప్‌: నెలకు టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.20,000, యంగ్‌ ప్రొఫెషనల్‌కు రూ.40,000, ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌కు రూ.56,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: ఆగస్టు 23.

Website:https://www.niab.org.in/Notifications_29_2025.aspx